పండ్లను తినటం ఆరోగ్యానికి మంచిదే..కాని ఏదిపడితే అది కలిపి తింటే అనారోగ్యానికి దారితీస్తాయి. మనం తినే పండ్లలో ఏది తింటే ఏంటి ప్రయేజనం అనే విషయం ముందుగా తెలిసి ఉండాలి. కొన్ని కొన్ని పండ్లు కొన్ని కొన్ని రోగాలకు ఔషధంలా పనిచేస్తే మరికొన్ని విషంలా పనిచేస్తాయి. అలానే కొన్ని పండ్లను కలిపి ఒకేసారి లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే కూడా తినకూడదు. అందులో ముఖ్యంగా జామ, అరటిపండు ఒకేసారి తినకూడదంట.
ఇంకా ఏం ఏం కలిపి తినకూడదో తెలుసుకుందాం..
ఎప్పుడైనా బొప్పాయి పండు తినేటప్పుడు నిమ్మరసం కానీ నిమ్మకాయను కానీ కలిపి తీసుకోవద్దట. ఇది చాలా ప్రాణాంతకమైంది. ఇలా తింటే ఎనిమియా సమస్యను కొని తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ లో కూడా సమస్యలు వస్తాయి. పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే విషయం తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇదే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే ఎక్కువ యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం కూడా ఉంది.
పుచ్చకాయ, కర్బూజ కూడా కలిపి తీసుకోకూడదనే విషయం మీకు తెలుసా. దీని వల్ల అజీర్తి సమస్యలు వస్తాయట. పండ్లలో ఆరెంజ్ ను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉంటారు. సీ విటమిన్ ఎక్కువగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పుల్లగా తియ్యగా భలే రుచిగా ఉంటుంది కదూ. అయితే ఈ పండుతో కలిపి క్యారెట్ ను అసలు తినకూడదు. అలా తినడం వల్ల గుండెలో మంట కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్నాయి కదా అని ఏదిపడితే అది ఒకేసారి తినకండి.