KGF2: దూసుకుపోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’.. ఈ సినిమాకు పని చేసిన తెర వెనుక హీరోలు వీళ్లే!

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ గురువారం విడుదలై సక్సెస్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నది. అతి త్వరలో రూ.1,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాల జాబితాలోKGF2 ఉంటుందని సినీ అభిమానులు అంటున్నారు. వరల్డ్ క్లాస్ మూవీ అని పొగిడేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినిమా సూపర్ హిట్ అని చెప్పేస్తున్నారు సినీ అభిమానులు.

ఈ సినిమా కోసం చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుండగా, ఎట్టకేలకు పిక్చర్ అభిమాన థియేటర్స్ లో విడుదలైంది. దాంతో సినీలవర్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ సినిమా కోసం పని చేసిన వ్యక్తుల్లో తెర మీద నటీనటులు , దర్శకులు ప్రధానంగా కనబడుతున్నారు. ప్రశాంత్ నీల్, యశ్ ఇతరుల గురించి ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ సినిమా కోసం తెర వెనుక ఉండి పని చేసిన హీరోలు కూడా ఉన్నారు. వాళ్లే టెక్నీషియన్స్.

కేజీఎఫ్ 2 ఇంత అద్భుతంగా రావడానికి టెక్నీషియన్స్ పనితీరు ముఖ్యమని చెప్పొచ్చు. సినిమా సక్సెస్ లో మేజర్ పార్ట్ మ్యూజిక్ ది. కాగా, స్వయంగా సినీ దర్శకుడు అయిన రవి బస్రూర్ ‘కేజీఎఫ్ 1’ ను మించిన మ్యూజిక్ ‘కేజీఎఫ్ 2’కు ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఇచ్చారు. ఇక దర్శకుడు అనుకున్న సన్నివేశాన్ని తన కెమెరా ద్వారా నిజం చేశారు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ్. KGF1 ను మించిన విజ్యువల్స్, గ్రాండియర్ నెస్ ను ఆయన వెండితెరపైన తన కెమెరాతో ఆవిష్కరించారు.

ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి గురించి బోలెడన్ని వార్తలొస్తున్నాయి. అతి తక్కువ ఏజ్ అనగా 20 ఏళ్లలోనే ఇంత పెద్ద సినిమాకు ఎడిటర్ గా పని చేశారు. సినిమా స్టోరి 1990ల్లోది కాగా, ఆ నేపథ్యానికి సంబంధించిన డిఫరెంట్ డ్రెస్సులు డిజైన్ చేశారు డిజైనర్ శివకుమార్. ఈ ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ వల్లే సినిమా చాలా అథెంటిక్ గా కనబడుతున్నది. ఇక యాక్షన్ సీక్వెన్స్ లను తెలుగులో రామ్-లక్ష్మణ్ మాస్టర్ల మాదిరిగా స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు-అరివు(అన్బరివు)లు ‘కేజీఎఫ్2’కు వర్క్ చేశారు.

వీరు చేసిన స్టైలిష్ స్టంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాకు స్టోరి, డైరెక్షన్ ప్రశాంత్ నీల్ చేయగా, మాటలను చంద్రమౌళి, ఎం.వినయ్ శివగంగే రాశారు. తెలగు సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించగా, కన్నడ వర్షన్ పాటలకు సాహిత్యం నాగేంద్రప్రసాద్, కిన్నల్ రాజ్, రవి బస్రూర్ అందించారు. జె.నందు అందించిన సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ముఖ్యం. మొత్తంగా సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ లో బిహైండ్ ద స్క్రీన్ టెక్నీషియన్స్ చాలా మందే పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news