విమానంలో రెస్టారెంట్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

-

ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం రెస్టారెంట్స్ కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు..ప్రముఖంగా వినిపించే రెస్టారెంట్స్ సైతం అదే పనిలో వున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లోని పిస్తా హౌస్‌ కూడా కొత్త రెస్టారెంట్ ను ప్రారంభిస్తుంది. రుచికరమైన వంటకాలు, రెసిపీలతో నగరవాసులను ఆకట్టుకుంటోన్న రెస్టారెంట్‌కు ఆదరణ బాగానే ఉంది.నగరంలోనే మొదటిసారిగా విమానంలో రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన ఏ320 రకం పాత విమానాన్ని కేరళలో నిర్వహించిన వేలంలో రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ విమానాన్నే త్వరలో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేటలో ఫ్లైట్‌ రెస్టారెంట్ గా ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా పరిసరాలను మార్చేస్తోంది. రన్ వే, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లో టికెట్లు తదితర ఏర్పాట్లను చేసింది. విమానంలో 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఎంచెక్కా విమానంలో కూర్చొని..శామీర్ పేట చెరువు అందాలను తనివి తీరా చూస్తూ, రుచికరమైన వంటకాలను ఆస్వాదించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను తీర్చిదిద్దనున్నారు.

ఇందులో మొత్తం150 సీట్లు ఉంటాయి. విమానంలోకి ప్రవేశించేందుకు వీలుగా ఎస్కలేటర్ ను కూడా నిర్మించనున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అచ్చం విమానంలో కుర్చున్న ఫీల్ ను అందించనున్నారు. డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ కొత్త రెస్టారెంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పిస్తా హౌస్‌ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ నగరానికి విమానాన్ని తీసుకురావడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని అండర్ పాస్ లో ఆ విమానాన్ని తీసుకొస్తుండగా ఇరుక్కుపోయింది. మేదర్‌మెట్ల పోలీసుల సహకారంతో విమానంను బయటికి తీశారు..ఇకపోతే వెయిటర్లు, సర్వర్లు ఎయిర్ హోస్టెస్ తరహాలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ ఏర్పాటుకానున్న పిస్తా హౌస్ ఫ్లైట్ రెస్టారెంట్‌లో కూడా ఇదే మోడల్‌ను అనుసరిస్తున్నారని తెలుస్తోంది.మొత్తానికి ఈ భారీ విమానం రెస్టారెంట్ కు సంబందించిన వీడియో వైరల్ అవుతుంది..మీరు ఓ లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version