టాలీవుడ్.. కోలీవుడ్ .. మాలీవుడ్.. శాండిల్ వుడ్.. బాలీవుడ్ .. హాలీవుడ్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలో ఏ భాషలో అయినా సరే ఒక సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల సెలబ్రిటీలు పోటీ పడతారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దర్శక నిర్మాతలు అయినా లేదా హీరోలు అయినా సరే ఆ సినిమాను రీమేక్ చేయాలని తెగ ఆసక్తి చూపుతూ ఈ క్రమంలోనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి మరి సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక ఇలా రీమేక్ చేసి తెరకెక్కించిన చిత్రాలతో కొన్ని సినిమాలు విజయాలు సాధిస్తే .. మరి కొంతమంది ఫ్లాప్ ను చవి చూసిన వారు కూడా ఉన్నారు.
ఇకపోతే చాలావరకు ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్.. నార్త్ ఇండియన్ సినిమాలు మాత్రమే అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ రీమేక్ అవుతూ వస్తున్నాయి.. కానీ గతంలోనే నటసింహం బాలకృష్ణ ఏకంగా హాలీవుడ్ చిత్రాలను కూడా రీమేక్ చేసి తెలుగులో తెరకెక్కించడం జరిగింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారినా.. ఆ సినిమాల ద్వారా కొంతవరకు బాలయ్య విజయం సాధించాడని చెప్పవచ్చు. మరి బాలయ్య బాబు రీమేక్ చేసిన ఆ హాలీవుడ్ చిత్రాలేవో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
లయన్.. ఈ సినిమాను పూర్తిస్థాయిలో మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాతో బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం నెలకొని ఉంది. ఇక ఈ సినిమా కూడా హాలీవుడ్ చిత్రం నుంచి రీమేక్ చేయబడింది. హాలీవుడ్ లో మంచి విజయం పొందిన టోటల్ రీకాల్ సినిమాను రీమేక్ చేసి తెలుగులో లయన్ సినిమా గా తెరకెక్కించారు. మరొకటి విజయేంద్ర వర్మ.. హాలీవుడ్లో తెరకెక్కిన ది బౌర్నే ఐడెంటిటీ సినిమాను, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాలను రెండూ తీసుకొని విజయేంద్ర వర్మ గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కూడా ఒక వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.