దేవాలయంలో నీళ్లు తాగడానికి వెళ్లిన బాలుడిని ఏం చేశారో తెలుసా..?

-

సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి, చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. అన్నదానం కన్నా.. నీటి దానం గొప్పది అని అంటుంటారు. కానీ.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. దేవాలయంలోకి వచ్చి నీళ్లు తాగాడని ఆ బాలుడికి ప్రస్తుతం రూ.10 లక్షల విరాళాలు పోగయ్యాయి. స్వచ్ఛంద సంస్థ కెటో బాధిత బాలుని కోసం ఆన్‌లైన్‌లో నిధులు సేకరించేందుకు విరాళాలు కోరింది.

boy

అయితే సదరు బాధిత బాలుడి గురించి తెలిసిన పలువురు దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. అలా ఆ బాలుడికి ఇప్పటివరకూ రూ.10 లక్షల విరాళాలు అందాయి. బాధిత బాలుడు చదువుకోవటానికి వారి కుటుంబం ఆర్థికంగా ఆదుకోవటానికి విరాళాలు అందించాల్సిందిగా కెటో సంస్థ కోరగా.. భారీగా నిధులు అందాయి. ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి కేవలం రెండు రోజుల వ్యవధిలో మొత్తం 648 మంది దాతలు ఈ విరాళాలను అందించటం గమనార్హం.

ఇక దాహంగా ఉన్న బాలుడు తాగునీళ్లు తాగటానికి యూపీలోని ఘజియాబాద్‌లో గల డస్నా దేవి మందిరం వద్దకు వచ్చాడు. కానీ మతోన్మాదం గల శృంగీ నందన్ యాదవ్ అనే వ్యక్తి మంచినీళ్లు తాగుతున్న బాలుడి వద్దకొచ్చి.. ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగాడు. దానికి ఆ బాలుడు ‘నా పేరు అసిఫ్’ అని సమాధానం ఇచ్చాడు. ఈ మాట విన్నవెంటనే యాదవ్ ఆ బాలుడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కొడతాడు. కిందపడవేసి చితక బాదాడు. ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలోకి వస్తావా? ఇక్కడి నీళ్లు తాగి కలుషితం చేస్తావా? అంటూ చితకబాదాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version