ఎప్పుడైనా మీరు గమనించారా..? మనకి ఎదుట ఉండే వ్యక్తి ఎవరైనా ఆవలిస్తే మనకి కూడా ఆవలింతలు వస్తాయి. కానీ ఎందుకు మనం కూడా వాళ్లను చూసి ఆవలిస్తాము అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా కలిగిందా..? అయితే నిజానికి ఆవలింత అనేది కంట్రోల్ చేసుకోలేము.
మన బాడీ అస్సలు ఆవలింతని కంట్రోల్ చేయలేదు. అయితే ఆవలించడం వల్ల బ్రెయిన్ టెంపరేచర్ రెగ్యులేట్ కి సహాయం చేస్తుందని 2014లో జరిగిన స్టడీ చెబుతోంది. నిజానికి ఆవలింత అనేది బ్రెయిన్ కూలింగ్ మెకానిజం. మనకి బాగా అలసట కలిగినప్పుడు ఆవలింతలు వస్తాయి.
మనకెందుకు అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి..?
మనకెందుకు అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి అంటే మెదడు యొక్క పనితీరు అలసట వలన స్లో అయిపోతుంది బ్రెయిన్ టెంపరేచర్ పడిపోతుంది ఈ కారణంగా అలసట కలిగినప్పుడు మనం ఆవలిస్తాము.
ఎందుకు బోర్ కొట్టినప్పుడు ఆవలింతలు వస్తాయి..?
మనం గమనిస్తే మనకు బోర్ కొట్టినప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వకుండా నెమ్మది అయిపోతుంది టెంపరేచర్ కూడా పడిపోతుంది. అలానే మనం యాక్టివ్ గా ఉండడానికి ముఖం పైన ముఖానికి బ్లడ్ సప్లై అవ్వడానికి.. అలెర్ట్ గా ఉంచడానికి అవుతుంది.
ఆవలిస్తున్న వ్యక్తులను చూస్తే ఎందుకు ఆవలింతలు వస్తాయి..?
నిజానికి ఆవలింత అనేది స్ప్రెడ్ లాంటిది. ఒకరు ఉండే పర్యావరణంలో టెంపరేచర్ లో ఇంకొకరు కూడా ఉంటే వాళ్ళు ఆవలిస్తూ ఉన్నట్లయితే మనకు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఆవలిస్తూ ఉన్న వీడియో చూసిన కూడా మనకి ఆవలింత వస్తుంది.
ఆవలింతని ఆపుకోవాలంటే ఏం చేయాలి..?
శ్వాస సంబంధిత ఎక్సర్సైజ్లు చేయడం
వాకింగ్ చేయడం
చల్లటి టెంపరేచర్ ఉండే చోట కూర్చోవడం
చల్లటి నీళ్లు తాగడం లేదా చల్లటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయొచ్చు.