శివ లింగం పై మహిళలు పసుపు ఎందుకు వేయకూడదో తెలుసా?

-

ఈ భూ ప్రపంచం మొత్తం శివుడి మాయం అంటారు. శివుడికి ఎరుక లేనిది చీమ కూడా కుట్టదని పురాణాలు చెబుతున్నాయి.అయితే శివుడిని భక్తితో పూజిస్తే వెంటనే ప్రసన్నుడు అవుతాడని అంటారు.అందుకే శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు.శివుడు అన్ని రకాల ఆడంబరాల నుండి దూరంగా ఉంటాడని నమ్ముతారు. అందుచేత శివారాధనలో గంజాయి, ఉమ్మెత్త, బిళ్వ పత్రం, , గంధపు ముద్ద, భస్మం, పచ్చి పాలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. శివుని పూజలో ఎటువంటి ఖరీదైన వస్తువులను ఉపయోగించకూడదు.

 

ముఖ్యంగా పసుపును మాత్రం అస్సలు వాడకూడదు..శివారాధనలో పసుపును ఉపయోగించడం వల్ల శివునికి కోపం వస్తుంది. పూజ యొక్క పూర్తి ఫలం లభించదు. అసలు శివలింగంపై పసుపు ఎందుకు వేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పసుపును సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ కారణంగా శివునికి పసుపు అంటే ఇష్టం ఉండదు. వాస్తవానికి పురాణ గ్రంధాలలో, శివలింగం శక్తికి చిహ్నం. ఇక పసుపు స్త్రీల అందాన్ని పెంచేందుకు వాడేది. అందువల్ల శివలింగంపై పసుపును సమర్పించడం నిషిద్ధమని నమ్ముతారు.

శివలింగంపై పసుపు వేయడం వల్ల వేడి పెరుగుతుందని నమ్ముతారు, అందుకే శివారాధనలో పసుపును అస్సలు వాడరు. శివాలయ దరిదాపుల్లో కూడా పసుపును తీసుకొని రారు.పసుపుతో పాటు, శివపూజలో ఇంకొన్ని ఇతర వస్తువులను ఉపయోగించడం కూడా నిషేధించారు. శివ పూజలో సింధూరం, తులసి ఆకులు కూడా ఉపయోగించకూడదు. సింధూరం శివుడికి సమర్పించ కూడదు. ఎందుకంటే సింధూరం స్త్రీల మాంగళ్యానికి చిహ్నం..వీటిని ఉపయోగించడం వల్ల శివుడికి కోపం పెరుగుతుంది..ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version