నైట్‌ లైట్స్‌ ఆన్‌ చేసి పడుకుంటున్నారా..? వారికి ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట

-

నైట్‌ లైట్స్ ఆన్‌లో ఉంటే చాలామందికి నిద్రపట్టదు.. దాదాపు అందరూ లైట్స్‌ ఆపేసే పడుకుంటారు.. కానీ, కొందరికి వివిధ కారణాల వల్ల లైట్‌ ఆన్‌లో ఉంచి పడుకోవడమే అలవాటుగా ఉంటుంది. భయమనో, ఇంకేదో అయి ఉండొచ్చు. అయితే తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో షాకింగ్‌ విషయం వెల్లడైంది. అదేంటంటే.. లైట్స్‌ వేసుకుని నిద్రపోయే వాళ్లకు ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు అధికంగా ఉంటుందని తేలిందట.

63 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు లైట్స్ వేసుకుంటారట. తాజా నివేదికల ప్రకారం వారిలో అధిక శాతం ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది… రాత్రి సమయంలో ఎటువంటి కాంతికి గురికానీ వారికంటే లైట్స్ వేసుకునే వారిలో ఆ సమస్యలు అధికంగా ఉన్నాయని నివేదికల్లో తేలింది.

వృద్ధులలో ఇప్పటికే మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది. వారు రాత్రిళ్లు ఎక్కువగా కాంతికి గురయినప్పుడు అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు…

ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో 552 మందిలో సగం కంటే తక్కువ మంది రోజుకు ఐదు గంటలు పూర్తి చీకటిని కలిగి ఉన్నారని అధ్యయన పరిశోధకులు తెలిపారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు లైట్స్ వేసుకుని నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరు చీకటిలో కంటే కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండడడమే ప్రధాన కారణం.. మధుమేహం కారణంగా పాదాల తిమ్మిరి ఉన్నవారు పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట కాంతిని ఉంచుకోవాలని చూసే అవకాశం ఉంది.

రాత్రుల్లు మాటి మాటికి లేవాల్సి వచ్చినవారు పూర్తిగా కాంతి ఉండే లైట్స్‌ కంటే.. డిమ్‌ లైట్‌ వాడటం మేలు. అంబర్ లేదా ఎరుపు, నారింజ రంగు కాంతి మెదడుకు తక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుంది.. తెలుపు, నీలం కాంతిని ఉపయోగించవద్దు. బయట నుంచి కాంతి పడుతున్నట్లేతే.. ఐ మాస్క్‌ వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news