ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బుతున్నాయా..! అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు

-

కొందరికి నిద్రలేవగానే..కళ్లు ఉబ్బిపోయి వాచినట్లు కనిపిస్తాయి. ఫ్రెష్ అయి..బ్రేక్ ఫాస్ట్ చేసే వరకూ..అంటే..ఓ గంట వరకు అలా ఉంటాయి. నిద్రమోఖం అంటుంటాంగా మనం. ఎక్కువ నిద్రపోతే ఇలా అ‌వటం కామన్..కాని కొంతమందికి ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉంటే..అది మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు..శరీరంలో కొన్ని వ్యాధులకు ఇది సంకేతం అని మీకు తెలుసా.

కళ్ల కింద నల్లటి వలయాలు, వాపులకు కొల్లాజెన్ లోపమే ప్రధాన కారణమని సౌందర్య నిపుణులు అంటుంటారు. ఇది నిజమే కొల్లాజెన్ మధుమేహం, మూత్రపిండాలు, కాలేయంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యాధులు వస్తే.. కొల్లాజాన్ దానికదే తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల కళ్ల కింద వాపులు ఏర్పడుతాయి.

కళ్ల కింద వాపు ఉందంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని అర్థం. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం ప్రారంభించినప్పుడు కళ్ల కింద వాపు మొదలవుతుంది. ముఖ్యంగా ఉదయం మేల్కొన్నప్పుడు అలాంటి సంకేతాలు తరచూ.. కనిపిస్తే వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిని టెస్ట్ చేసుకోవాలి.

మూత్రపిండాల సమస్యలు

కిడ్నీ సమస్యలు రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల లేదా కిడ్నీలో రాళ్ల కారణంగా. రక్తంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు శరీరం నుంచి అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు చాలా ఎక్కువ కష్టపడతాయి. అటువంటి పరిస్థితిలో కిడ్నీ అలసిపోతుంది. అందుకే షుగర్ ఉన్నవాళ్లను త్వరగా అరిగిపోయే పదార్థాలు మాత్రమే తినమని వైద్యులు అంటుంటారు. ఎందుకంటే.. అరగటానికి ఎక్కువ సమయం పట్టేవి తింటే..కిడ్నీలు ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. అన్నం కూడా తినొద్దని చెప్పడానికి కారణం ఇదే. ఏది తిన్నా పొట్టినిండా ఒకేసారి తినకూడదు. కొద్దికొద్దిగా గ్యాప్ ఇంచి తింటుండాలి. మూత్రపిండాలు దాని సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేస్తుంటే దాని ప్రభావం కళ్ల కింద వాపు రూపంలో కనిపిస్తుంది.

కాలేయం

కాలేయ సమస్యలుంటే కళ్ల కింద వాపులు వస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతంగా దీన్ని చెప్పవచ్చు. శరీరంలో అధిక చక్కెర కారణంగా కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కూడా కళ్ల కింద వాపులు వస్తాయి.

తరుచూ నిద్రలేవగానే కళ్లు ఉబ్బిపోతుంటే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version