అమెరికా కి డొనాల్డ్ ట్రంప్ రెండో అధ్యక్ష పదవీని చేపట్టిన తరువాత సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇతర దేశాలపై కీలక ఆర్థిక నియమాలను తీసుకుంటూ.. భారీ సుంకాలను విధిస్తూ.. ప్రపంచ వాణిజ్యంలో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికే పలు దేశాలపై అధిక సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా భారత్ ను కూడా అదే జాబితాలో చేర్చాడు. భారత్ పై 25 శాతం దిగుమతి సుంకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించాడు.
ఈ కొత్త సుంకాల విధానం ఆగస్టు 01వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. “భారత్ మా మిత్ర దేశం అయినప్పటికీ.. ఎన్నో సంవత్సరాలుగా వారి మనం స్వల్ప స్థాయిలోనే వాణిజ్యం కొనసాగిస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం భారత్ విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండటం. అంతేకాదు. వారు ద్రవ్యేతరంగా విదేశీ వాణిజ్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచంలో అత్యంత కఠినమైన అడ్డంకులను అమలు చేస్తున్నారు. భారత్ తమ రక్షణ పరికరాల కోసం ఎక్కువ రష్యా నుంచే కొనుగోళ్లు చేస్తోంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్ ప కొనసాగుతునన దాడులను ఆపాలని ప్రపచం ఆశిస్తున్న తరుణంలో భారత్, చైనా సరసన నిలిచి రష్యా ఉత్పత్తులకు అతి పెద్ద కొనుగోలుదారిగా మారింది. దీంతో 25 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.