పిచ్చుకపై బ్రహ్మాస్తంలా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది రష్యా. సైనిక పరంగా, ఆర్థిక పరంగా ఎలా చూసినా.. రష్యా ముందు చాలా చిన్నది ఉక్రెయిన్. దీంతో రష్యా సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని అనుకుంటోంది. దీనిపై అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ, కెనడా, ఇతర యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా పట్టించుకోవడం లేదు రష్యా. తన లక్ష్యాన్ని సాధించే వరకు యుద్ధం వీడే ప్రస్తక్తి లేదని చెబుతోంది.
ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తరువాత నెక్ట్ టార్గెట్ తైవాన్ అని అన్నారు. ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకోవడం పూర్తయిన తర్వాత తదుపరి దాడి తైవాన్ పైనే జరుగుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇందుకోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని అన్నాడు. అమెరికా నేతలను ప్రపంచ దేశాలు అసమర్థులుగా చూస్తున్నారని.. దీంతో వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ట్రంప్ అన్నారు.