చాలా మంది భార్యాభర్తలు వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి వివాహం అనేది పవిత్రమైన బంధము. వివాహంతో రెండు మనసులు రెండు కుటుంబాలు ఏకమవుతాయి. అయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా వీటిని పాటించాలి అని చాణిక్యనీతి చెబుతోంది. మరి ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా ఏ విషయాలను చెప్పారు అనేది చూద్దాం.
అహంకారం ఉండకూడదు:
భార్యాభర్తలు ఎప్పుడూ కూడా నేనంటే నేను అని అహంకారంతో ఉండకూడదు. అహంకారం ఉంటే భార్యాభర్తలు వైవాహిక జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఎప్పుడూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో ముఖ్యం.
సహనంతో ఉండాలి:
భార్యాభర్తలు ఎప్పుడు కూడా సహనంతో ఉండాలి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ సహనాన్ని కోల్పోకండి. బలమైన సంబంధాన్ని కొనసాగించాలి అప్పుడే వైవాహిక జీవితంలో సక్సెస్ పొందుతారు.
రహస్యాలని చెప్పకూడదు:
భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండాలి అవి ఇతరులతో పంచుకోకూడదు. వాటిని ఇతరులతో పంచుకోవడం వల్ల చులకన అయిపోవడం తో పాటుగా వైవాహిక జీవితం కూడా ముక్కలవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలని భార్యాభర్తలిద్దరూ పాటిస్తే ఖచ్చితంగా వాళ్ల యొక్క వైవాహిక జీవితం చక్కగా సాగుతుంది ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండగలరు.