సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి : సజ్జనార్‌

-

మిధానీ డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ బస్సు 104-ఎ రూట్‌లో వెళుతుండగా ఓ యువకుడు ద్విచక్రవాహనం నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుకభాగాన్ని నెడుతున్నట్టుగా ఫోజులిచ్చాడు. ఈ ఘటనను వెనుక వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ ఘాటుగా హెచ్చరించారు. ‘

వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే ప్రయాణ సమయంలో కారు, ఆటో వంటి వాహనాలు నడిరోడ్డుపై ఆగిపోతే, వాటిని బైక్‌, లేదా మరో వాహనం సాయంతో కాలుతో నెట్టుకుంటూ వెళ్లడం మనం తరచూ చూస్తుంటాం. ఓ యువకుడు మాత్రం రోడ్డుపై వేగంగా వెళ్తున్న బస్సును కాలుతో నెడుతూ కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version