మీ ఫోన్ కాల్‌ను రికార్డు చేస్తున్నట్టు డవుట్ కొడుతోందా..? అయితే ఇలా తెలుసుకోండి..!

-

ఒక్కొక్క సారి మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనకి వాళ్ళు కాల్ రికార్డింగ్ చేస్తున్నారేమో అని సందేహం కలుగుతుంది. మీరు కూడా ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్లు కాల్ రికార్డింగ్ చేస్తున్నారేమో అని సందేహం కలుగుతుందా..? ఎలా తెలుసుకోవాలి అని మీరు చూస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు దీనిని చూడాల్సిందే. ఇలా చేస్తే ఫోన్ కాల్‌ను రికార్డు చేస్తున్నట్టు కలిగే డవుట్ ని తీర్చుకోవచ్చు..

 

కాల్ రికార్డింగ్ అనేది చాలా దేశాల్లో నిషిద్ధం అన్న విషయం తెలిసిందే. సో గూగుల్ థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్‌ ని తొలగించింది. ఇన్‌బిల్ట్ యాప్‌తో తప్ప థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ ద్వారా మనం కాల్స్ ని రికార్డ్ చెయ్యడమే కుదరదు.

ఇన్‌బిల్ట్ యాప్‌తో కనుక ఎవరైనా మీ ఫోన్ కాల్ ని రికార్డ్ చేస్తుంటే మీకు అలెర్ట్ అనేది వస్తుంది. మీ కాల్ రికార్డ్ అవుతోంది అని మీకు అనౌన్స్‌మెంట్ వస్తుంది. కానీ ఎవరైనా ఇంకో ఫోన్ ద్వారా కాల్ ని రికార్డ్ చేస్తుంటే మాత్రం ఇలా రాదు. అలానే మీ కాల్ రికార్డ్ అవుతున్నప్పుడు బీప్-బీప్ అని సౌండ్ వస్తుంది.
అదే కాల్ ట్యాపింగ్ విషయానికి వస్తే.. కాల్ ట్యాపింగ్ అంటే ఇద్దరు వ్యక్తుల మాటలని మూడో వ్యక్తి రికార్డు చేయడం. కాల్ ట్యాపింగ్‌ను ని కనుగొనడం ఈజీ కాదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version