Viral : 1998లో డీఎస్సీ రాసిన అభ్యర్థికి.. 57 ఏళ్లకు టీచర్ ఉద్యోగం..!

-

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 DSC అభ్యర్దులకు జగన్‌ సర్కార్‌ శుభ వార్త చెప్పిన సంగతి తెలిసిందే. వారికి న్యాయం చేసే ఫైల్ పై సంతకం చేశారు సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి. వారికి ఉద్యోగం ఇచ్చేందుకు విధివిధానాలను సిద్దం చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న 98 DSC ఫైల్ పై సీఎం సంతకం చేశారని.. 20 ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉంది.

ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదని.. అభ్యర్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంది. అయితే.. జగన్‌ సర్కార్‌ తాజాగా తీసుకున్న ఈ నిర్నయంతో.. 1998 లో డీఎస్సీ రాసిన ఓ వ్యక్తికి.. 57 ఏళ్లు ఉన్న వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పాత పట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు. ఇతను 1998 లో డీఎస్సీ పరీక్ష రాయగా.. జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో.. తాజాగా అతనికి టీచర్‌ ఉద్యోగం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version