తొలిసారి రోబో న్యాయవాదిని సృష్టించిన డునాట్ పే స్టార్టప్ కంపెనీ

-

కృత్రిమ మేథస్సు (ఏఐ – ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అనేది రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించబోతోంది. ఇప్పటి వరకు మన జీవితాల్లోకి ప్రవేశించిన టెక్నాలజీ… రాబోయే రోజుల్లో ఏఐ రూపంలో మన ఇంట్లోకి కూడా ప్రవేశించబోతోంది. ఇప్పుడు ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ. డ్రైవర్ లేకుండానే కారు వెళ్లడం, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో కోడిగుడ్లు ఉన్నాయా, లేదా చెప్పడం లాంటివెన్నో దీని కిందకు వస్తాయి. ఏఐ అనేది రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించబోతోంది. ఏఐ అనేది మన జీవితాలకు చాలా ప్రమాదకరం అని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే… అది మన జీవితాల్లోకి చాలా వేగంగా విస్తరిస్తోంది.

First AI-powered "robot" lawyer will represent defendant in court next  month - CBS News

ఈ క్రమంలో, వచ్చే నెలలో ఒక రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారి కోర్టులో కేసును వాదించబోతోంది. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు విధించిన చలానా కేసులో ఈ రోబో న్యాయవాది తన వాదనలను వినిపించనుంది. ఈ మేరకు అమెరికాలోని కోర్టులో వాదనలను వినిపించబోతోంది. డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన కేసును ఈ రోబో వాదించబోతోంది. అయితే, ఈ కేసు విచారణ ఏ కోర్టులో జరుగబోతోందో ఆ కంపెనీ సమాచారం అందించలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news