రేపు ద్వారకాదీశ్ ఆలయం మూసివేత

-

బిపర్జోయ్ తుపాను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌లలో అలర్ట్ ప్రకటించారు. కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుఫాను ‘బిపార్జోయ్’ ల్యాండ్‌ఫాల్ ( తీరం దాటుతుందని) అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. వాయుగుండం గుజరాత్ తీరం వైపు దూసుకుపోవడంతో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. తుఫాను గురువారం సాయంత్రం “తీవ్రమైన తుఫానుగా” తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట గాలి వేగం గంటు 150 కిలో మీటర్లకు చేరుకుంటుందని తెలిపారు.

ఒక కచ్ జిల్లాలోనే 34,000కు పైగా ప్రజలను తరలించారు. వీరికి బీఎస్ఎఫ్ జవాన్లు షెల్టర్ లను నిర్మించారు. ఇక్కడి తొమ్మిది నగరాలు పూర్తిగా మూసివేయబడ్డాయి! సౌరాష్ట్ర – కచ్ సహా వివిధ తీర ప్రాంతాల్లో తీవ్ర గాలులతో భారీ వర్షం కురుస్తోంది. రేపు ద్వారకలోని ద్వారకాదీశ్ అలయాన్ని మూసివేస్తున్నారు. మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లతో సమీక్షించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version