దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో భూప్రకంపనలు చోటు చేసున్నాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చారు. ఈరోజు ఉదయం 9.45 గంటలకు భూకంప తీవ్రత కనిపించింది. జనాలు అంతా ఆఫీసులకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు కొంత ఆందోళన చెందారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ మరియు సమీప నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని కొంతమంది నివాసితులు కనీసం 20 సెకన్ల పాటు భూమి కంపించిందని ట్వీట్ చేశారు.
భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్- తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో భూకంప కేంద్రం నమోదైంది. రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఇండియన్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. భూమికి 181 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది. ఇండియాతో పాటు పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో కూడా భూకంప తీవ్రత కనిపించింది.