వరస భూకంపాలతో పలు రాష్ట్రాలు కలవరపడుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రీజియన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవల తరుచుగా భూకంపాలు ఎక్కువయ్యయి. ఇటీవల మణిపూర్, మిజోరాం, అస్సాం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. అయితే భూకంపాల తీవ్రత సగటున 4 తీవ్రతతో నమోదవుతున్నాయి. తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుండటంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు లేవు.
తాజాగా ఇండియాలో మరో భూకంపం సంభవించింది. లడఖ్ ప్రాంతంలో లేహ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై3.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. లేహ్ కు తూర్పున 81 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.