మిజోరాంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.7 గా తీవ్రత

-

ఈశాన్య రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో మరోసారి భూకంపం వచ్చింది. ఇంతకు ముందు కూడా ఇలానే మిజోరాంలో భూకంప సంభవించింది. శుక్రవారం అర్థరాత్రి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 3.7గా భూకంప తీవ్రత నమోదైంది. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ లో భూమి కంపించింది. ఐజ్వాల్ కు కేవలం 31 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్ర ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయి ఉంది.

గత నెల 29న కూడా మిజోరాంలో భూకంపం వచ్చింది. ఛంపాయ్‌ జిల్లాలోని 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఛంపాయ్‌కు 69 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.

ఇటీవల కాలంలో ఇండియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రిజియన్ లో ఎక్కువగా భూకంపాలు వస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవల కాలంలో భూకంపాలు సంభవించాయి.

Read more RELATED
Recommended to you

Latest news