కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు, కూరగాయల్ని తీసుకోండి..!

-

కిడ్నీల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కిడ్నీలు చాలా ముఖ్యమైన పని చేస్తాయి. ఒంట్లో ఉండే చెడు పదార్థాలను తొలగించి బయటికి పంపిస్తాయి. బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేసే హార్మోన్లను కూడా కిడ్నీలు విడుదల చేస్తాయి.

అయితే చాలా మంది కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకునే డైట్ లో వీటిని చేర్చుకుంటే మంచిదని డాక్టర్లు అంటున్నారు. అయితే కిడ్నీ ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని గురించి కూడా పూర్తిగా చూసేయండి.

రెడ్ క్యాప్సికమ్:

ఎర్రటి క్యాప్సికమ్ లో పొటాషియమ్ తక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. ఎర్ర క్యాప్సికమ్ ను తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలానే ఇబ్బందులు కూడా ఉండవు.

కాలిఫ్లవర్:

కాలీఫ్లవర్లో విటమిన్స్ మరియు ఇతర పోషక పదార్థాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

క్యాబేజ్:

క్యాబేజ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే గుణం ఉంటుంది. అలానే ఇంఫ్లమేషన్ సమస్యలు కూడా దూరం చేస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్షలోని ఫ్లేవనాయిడ్స్ గుణాలు ఉంటాయి ఇది కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే కిడ్నీలకు కూడా స్ట్రాబెరీ చాలా మంచిది. అదే విధంగా చెర్రీస్ కూడా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇలా వీటిని డైట్ లో చేర్చుకొని కిడ్నీ సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news