సైనా నెహ్వాల్ కు క్ష‌మాప‌ణలు చెప్పిన సిద్ధార్థ్

-

ఈ మ‌ధ్య కాలంలో హీరో సిద్ధార్థ్ చేసిన ఒక ట్వీట్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ఒక ట్వీట్ కు సిద్ధార్థ్ రిప్లే ఇస్తు.. ఒక‌ అస‌భ్య‌క‌రమైన ప‌దాన్ని వాడారు. దీంతో ఆ ట్వీట్ పెను దూమారాన్ని లేపింది. అయితే ఈ స‌మ‌స్య‌పై హీరో సిద్ధార్థ్ ఎట్టకేల‌కు సైనా నెహ్వాల్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. సైనా కు సారీ చెబుతూ ట్విట్ట‌ర్ లో ఒక లెట‌ర్ ను పోస్టు చేశాడు. “కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్ కు నేను రిప్లే ఇస్తు రూల్డ్ జోక్ ను వేశాను. దానికి నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నుకుంటున్నాను. నేను మీతో చాలా సార్లు ఏకీభవించాను.

కానీ ఈ ట్వీట్ ను చూసాక కాస్త నిరాశ‌కు గురి అయ్యాను. ఆ సంద‌ర్భంలో నేను ఆ ట్వీట్ చేశాను. అయితే నేను చేసింది ఒక జోక్ మాత్ర‌మే. దీని పై నేను వివ‌రాణ కూడా ఇస్తాను. ఎది ఏమైనా ఆ జోక్ మీకు న‌చ్చ‌లేదు. అందుకే సారీ. అని లెట‌ర్ లో సిద్ధార్థ్ రాసుకువ‌చ్చాడు. అయితే తాను స్త్రీ వాది అని.. ఎప్పుడు కూడా మ‌హిళ‌ల గురించి త‌ప్పుగా మాట్లాడ‌లేదుని” అన్నారు. అలాగే తాను చేసిన ట్వీట్ లోనూ మ‌హిళ‌ పై దాడి చేసే ఉద్ధేశం కాని లింగ ప‌రంగా కూడా ఎలాంటి ప‌దాలు లేవ‌ని అన్నారు. అలాగే త‌న క్ష‌మాప‌ణల‌ను అంగీక‌ర‌స్తార‌ని అశిస్తున్నాని అన్నారు. అలాగే ఎప్పుడు కూడా ఛాంపియ‌న్ గా ఉంటార‌ని ఆశిస్తున్నాని సిద్ధార్థ్ తెలిపాడు. కాగ ఈ లెట‌ర్ పై సైనా ఎలా స్పందింస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news