వేసవిలో ఈ పండ్లు తింటే… గుండె ఆరోగ్యం బాగుంటుంది…!

-

ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాలని తీసుకుంటూ ఉండాలి. అలానే సీజనల్ ఫ్రూట్స్ వంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ఆరోగ్యం బాగుండేందుకు మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. వేసవికాలంలో మనకి పుచ్చకాయ కర్బూజ పండ్లు మామిడి ఎక్కువగా కనబడతాయి. వీటితో పాటుగా ఫాల్సా పండ్లు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి ఫాల్సా పండ్ల వల్ల చక్కటి బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు. ఈ పండ్లతో చాలామంది షర్బత్ ని తయారు చేసుకుంటూ ఉంటారు.

పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి వాటిల్లో ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈ పండ్ల లో విటమిన్ సి ఐరన్ క్యాల్షియం ఫాస్ఫరస్ కూడా బాగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా లభిస్తాయి పైగా ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి కణాలని రక్షించడానికి హెల్ప్ అవుతుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది.

ఎర్ర రక్త కణాలు ఏర్పాట్లు కి ఐరన్ చాలా అవసరం ఆరోగ్యకరమైన ఎముకలు దంతాలకి కూడా
పొటాషియం, క్యాల్షియం అవసరం అయితే ఈ పండ్లను తీసుకుంటే ఇవన్నీ మనకి దొరుకుతాయి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫాల్సా పండ్ల లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అలానే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి రక్షణ లభిస్తుంది ఇలా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

జీర్ణక్రియ కి కూడా మేలు కలుగుతుంది. పేగు కదలికలని చురుకుగా మార్చేస్తుంది కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి పొట్ట ఉబ్బరం మలబద్ధకం జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. వేసవికాలంలో ఈ పండ్లు తీసుకుంటే చలవ చేస్తుంది సమ్మర్ కి బెస్ట్ ఫ్రూట్ ఇది. ఈ పండ్లు వేడిని తగ్గించడంతో పాటుగా సీతలీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది వడదెబ్బ వంట సమస్యలు ఉండవు చల్లగా ఉంచుతుంది హైడ్రేట్ గా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news