అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆకుపచ్చ అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకు పచ్చ అరటి పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, పాలిఫినాల్స్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి.
బరువు తగ్గడానికి, డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ రోజు ఆకుపచ్చ అరటి పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం కూడా పూర్తిగా చూద్దాం.
జీర్ణ ప్రక్రియకి మంచిది:
ఆకుపచ్చని అరటి పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణం బాగా జరుగుతుంది. ఆకుపచ్చని అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఎ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి. కాన్స్టిపేషన్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు వంటివి తొలగిస్తాయి.
బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది:
ఆకుపచ్చ అరటిపండులో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తలనొప్పి, చెస్ట్ పెయిన్, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి సమస్యలని కూడా ఇది తగ్గిస్తుంది.
బరువు కంట్రోల్లో ఉంటుంది:
100 గ్రాములు ఆకుపచ్చ అరటిపండులో 105 క్యాలరీలు ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్ కి ఇది బాగా సహాయపడుతుంది.
కార్డియో వాస్క్యులర్ హెల్త్ కి మంచిది:
గుండె ఆరోగ్యానికి ఆకుపచ్చని అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. కార్డియో వాస్క్యూలర్ సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆకుపచ్చ అరటిపండ్లను డైట్ లో తీసుకుని ఈ సమస్యల నుండి బయటపడండి.