లోన్ యాప్ కేసుల్లో మరో 19 కోట్లు అటాచ్ చేసిన ఈడీ..!

-

లోన్ యాప్ కేసుల్లో మరో 19 కోట్లు అటాచ్ చేసింది ఈడీ. అయితే గతంలో ఈ రుణ యాప్ లపై తెలంగాణాలో 118 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో దేశ వ్యాప్తంగా ఈ లోన్ యాప్ కేసులు హల్ చల్ చేసాయి. చాలా మంది బాధితులు ఈ రుణ యాప్ ల ట్రాప్ లో పడి ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ కేసుల ఆధారంగానే 242 రుణ యాప్‌ లపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఈడీ. ఈ కేసులకు గతంలో పలు ఫిన్ టెక్ కంపనీలకు చెందిన ఆస్తులు, బ్యాంకు నిల్వలు అటాచ్ చేసిన ఈడీ.. ఇప్పుడు నిమిష ఫిన్‌ టెక్ ప్రై లి, రాజ్ కోట్ ఇన్వెస్టిమెంట్స్, మహానంద ఇన్వెస్టిమెంట్స్, బస్కిన్‌ మేనేజ్మెంట్ సహా ఇతర సంస్థలకు చెందిన మొత్తం 19.39 కోట్ల ఫిక్సడ్ డిపాజిట్లతో పాటుగా బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను కూడా అటాచ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version