శుభవార్త.. వంటనూనెపై రూ.10 తగ్గింపు..!

-

ప్రజలకు ఊరట కలిగించే విషయం. ప్ర‌పంచ వ్యాప్తంగా వంటనూనె రేట్లు తగ్గుతుండడంతో దేశంలో కూడా ఆయిల్ కంపెనీలు తమ వంటనూనె బ్రాండ్ల రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల ఎంఆర్‌‌పీని లీటర్‌‌పై రూ. 10 చొప్పున తగ్గించాలని, ఈ తగ్గింపు కూడా వచ్చే వారంలోపే జరగాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో పాటు ఒక బ్రాండ్‌ వంట‌నూనె రేటు దేశ‌మంత‌టా ఒకేలా ఉండాలని స్ప‌ష్టం చేసింది కేంద్రం. ప్రస్తుతం వివిధ న‌గ‌రాల్లో ఒకే బ్రాండ్ వంట‌నూనె లీట‌రు ధ‌ర‌లో మూడు నుంచి ఐదు రూపాయ‌ల తేడా ఉంద‌ని, ఇక నుంచి ఒకే గ‌రిష్ఠ ధ‌ర ఉండేలా చూసుకోవాల‌ని కంపెనీల‌కు సూచించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో వంటనూనె అవసరాల్లో 60 శాతం విదేశాల నుంచే దిగుమ‌తి అవుతున్న నేపథ్యంలో.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ప్ర‌పంచ వ్యాప్తంగా వంటనూనె రేట్లు పెరిగాయి.

Why edible oil prices are on fire during a period of low demand - India  Today Insight News

దీంతో మ‌న దేశంలో కూడా కంపెనీలు ధ‌ర‌లు భారీగా పెంచాల్సి వచ్చింది. కానీ, గత కొన్ని నెలల నుంచి వంటనూనెల ధ‌ర‌లు తగ్గుతూ రావడంతో.. గ‌త‌ నెలలో వంటనూనె ధరను ఆయా కంపెనీలు లీటర్‌‌పై రూ. 10–15 తగ్గించాయి. వంటనూనె రేట్లు తగ్గడంపై చర్చించేందుకు వంటనూనె తయారీదారుల అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే. ప్రస్తుత పరిస్థితులు, ఎంఆర్పీ తగ్గింపుపై చర్చలు జరిపి.. అంత‌ర్జాతీయంగా త‌గ్గిన ధ‌ర‌ల‌ను వినియోగ‌దారుల‌కూ బదలాయించాలని సూచించారు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే.

 

Read more RELATED
Recommended to you

Latest news