ఎడిట్ నోట్: కమల ‘విపక్షం’.!

-

గత 9 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీకి ఎదురులేకుండా పోతున్న విషయం తెలిసిందే. కమలం పార్టీకి కాంగ్రెస్ సైతం చెక్ పెట్టలేని పరిస్తితి ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కమలం పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలని చూస్తుంది. కానీ ఈ సారి అధికారంలోకి రావడం అనేది అంత ఈజీ కాదు..రెండు సార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే వ్యతిరేకత కనిపిస్తుంది.

కాకపోతే బి‌జే‌పికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలపడకపోవడం. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బలపడలేదు. దీని వల్ల బి‌జే‌పికి ప్లస్ అవుతుంది. అదే సమయంలో విపక్షాలు ఏకమవ్వడం లేదు. దీని వల్ల బి‌జే‌పికి వచ్చిన ఇబ్బంది ఏమి కనబడటం లేదు. కానీ తాజాగా కొన్ని విపక్షాలు ఏకమై..ప్రధాని మోదీకి లేఖ రాశాయి. కేంద్ర సంస్థలని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలని వేధించడం, గవర్నర్ వ్యవస్థపై విపక్ష నేతలు మోదీకి లేఖాస్త్రం సంధించారు.

kcr

తెలంగాణ సి‌ఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు, పశ్చిమ బెంగాల్ సి‌ఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సి‌ఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ సుప్రీం లీడర్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్…వీరంతా కలిసి మోదీకి లేఖ రాశారు. అలాగే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ అరెస్టుపై మోదీ సర్కారుని టార్గెట్ చేశారు.

అసలు మనీష్ సిసోడియాకు సంబంధించి ఒక్క ఆధారం కూడా వ్యతిరేకంగా లేదని..అయినా టార్గెట్ చేసి ఆయన్ను అరెస్ట్ చేసారని ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని,  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో పదేపదే గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మొత్తం మీద కేంద్రంలోని బి‌జే‌పిని టార్గెట్ చేసి విపక్షాలు ఏకమై..ప్రధానికి లేఖ రాశారు. అయితే లేఖలోని అంశాలని మోదీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారో తెలియదు గాని..దీని ద్వారా విపక్షాలు ఏకమవుతున్నాయని తెలుస్తోంది. కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా మిగతా పక్షాలు కలిసినంత మాత్రాన..బి‌జే‌పికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. మరి చూడాలి ఫ్యూచర్ లో విపక్షాలు అన్నీ కలుస్తాయేమో.

Read more RELATED
Recommended to you

Latest news