ఎడిట్ నోట్: జగన్ అభయ ‘హస్తం’..!

-

జగన్ తుమ్మిన..దగ్గిన టి‌డి‌పి అనుకూల మీడియాలో పెద్దగా చేసి కథనాలు వేయడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశాన్ని బూతద్దంలో పెట్టి వార్తలు వండేస్తుంది. ఇక వీటిల్లో కల్పిత కథనాలే ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో నిజమెంత ఎంత ఉందనేది ఎవరికి తెలియదు. ఇక ప్రతి సారి జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు..అక్కడ బి‌జే‌పి పెద్దలని కలుస్తారు. అయితే వారి మధ్యలో ఎలాంటి చర్చలు జరిగాయో ఎవరికి తెలియదు.

కానీ వారు అలా మాట్లాడుకున్నారు..ఇలా మాట్లాడుకున్నారు..అంటూ ఆ మీటింగ్‌లో తాము ఉన్నట్లు టి‌డి‌పి మీడియా కథనాలు వేయడం మామూలే. ఇక తాజాగా టి‌డి‌పికి భజన చేసే ఓ అనుకూల మీడియా సంస్థ కొత్త పలుకు అంటూ..జగన్..కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నారని పెద్ద కథనమే వేసింది. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ అదేదో ఆ మీడియాకి తెలిసినట్లు కథనం వేసింది. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తున్న జగన్ సోదరి షర్మిల..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి..తాను కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇక షర్మిలని కాంగ్రెస్ లోకి తీసుకుని ఏపీ బాధ్యతలు ఇస్తారని టాక్ నడిచింది.

షర్మిల ఏపీకి వస్తే తనకే రాజకీయంగా ఇబ్బంది అని జగన్ భావించి..తాను సైతం కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు చూస్తున్నారని చెప్పుకొచ్చింది. కేంద్రంలో ఇప్పుడు ఎలాగో బి‌జే‌పితో అంతర్గతంగా కలిసి పనిచేస్తున్న జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో బి‌జే‌పి అధికారంలోకి వస్తుందో రాదో క్లారిటీ లేదు కాబట్టి..కాంగ్రెస్ తో కలవడానికి కూడా రెడీ అయ్యారని చెప్పుకొచ్చింది.

‘నేను మీ వాడినే ఎన్నికల తర్వాత మా ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇస్తారు’ అని కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ సందేశం పంపారట. పైగా కాంగ్రెస్ సీనియర్ కే‌సి వేణుగోపాల్ సైతం..జగన్ మనవాడే…ఎన్నికల తర్వాత వైసీపీ ఎంపీలు కాంగ్రెస్‌కు సహకరిస్తారని..షర్మిలతో అన్నారట. దీంతో షర్మిల షాక్ అయ్యారట. అయితే ఇదంతా టి‌డి‌పి మీడియా వండి వార్చిన కథనం మాత్రమే. ఇది రియాలిటీకి పూర్తిగా దూరంగా ఉంది.

షర్మిల కాంగ్రెస్  పార్టీలోకి వెళుతుందే వాస్తవమే..అదే సమయంలో జగన్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారనే అంశంలో వాస్తవం లేదు. కానీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే..వారితో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే జగన్ లక్ష్యం. కాబట్టి కేంద్రంలో బి‌జే‌పి ఉన్నా..కాంగ్రెస్ ఉన్న జగన్‌కు ఒక్కటే.

Read more RELATED
Recommended to you

Latest news