విషాదంతో ఆదివారం మొదలయింది. సండే మేగజీన్ లో ఆ వార్త లేదు. ఆ వార్త అప్పటికింకా లోకంకు గుర్తింపులో లేదు. ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు సైమండ్స్ (ఆండ్రూ సైమండ్స్) ఇక లేరు అని రాయడంతో ఉదయం ఆరంభం అయి ఉంది. మనం ఎన్ని చెప్పినా ఎన్ని వద్దనుకున్నా చావు నుంచి లోకాన్ని, లోకం నుంచి చావుని వేరు చేసి చూడలేం.కేవలం మరణ సంబంధ ఐక్యత ఒకటి వస్తే అది ఈ వార్త నిర్థారిస్తే కొంతలో కొంత మేలు. అంటే మనుషులు విలయాలకు నిషిద్ధ కాలాలకు కూడా ఒకే విధంగా ధోరణిలో మార్పు అన్నది లేకుండా ఉంటారు. ఉండే ఉంటారు. కానీ మనం కాస్త మార్పు కోరుకునే మనుషుల దగ్గర నిల్చొని లోకాన్ని చూస్తే కాస్తయినా క్రాంతి రేఖలు విషాద ఉదయాలను వికసింపజేస్తాయి.
సైమండ్స్ అనే కాంతి ఇప్పుడు అందులో జీవగతం అయి ఉంటుంది. ఆత్మ ప్రబోధాత్మకం ఒకటి కావాలి. ఆయనే కాదు ఎవ్వరికి అయినా తప్పని మరణం నుంచి తప్పించుకోని దుఃఖం వరకూ కొన్ని విశ్లేషణకు అందే ఉంటాయి. ఆ విధంగా ఉదయ కాల విషాదాలను మనం మార్చుకుంటూ వెళ్లాలి. లేదా విషాద స్మరణలో విజయాలు, ఓటములతో సహా కొన్నింటిని గుర్తించి, ఆ అవశేషాల గుర్తింపులో మిగిలిన కాలం ఎలా ఉంటుంది అన్నది కూడా అంచనా వేయాలి.
ఆటలన్నీ ఒక దగ్గర ఒక ముగింపును కోరుకుంటాయి. ఆట ముగిశాక విస్తృతం అయిన విషాదం ఒకటి తెలియకుండానే ఆవహిస్తుంది. పెద్ద పెద్ద సినిమావాళ్లు, క్రికెట్ స్టార్స్ వీళ్లంతా తమని తాము కాస్త అతిగా చూపే సందర్భాలను చూసి నవ్వుకుంటూ ఉంటారు. కాలం గొప్పది కదా ! నువ్వు ఆ క్షణానికే విజేతవు అని చెప్పి వెళ్తుంది.ఈ క్షణకాల విజేతను చరిత్ర గుర్తించి అక్షర రూపంలో దాచుకుంటుంది. ఆ విధంగా సైమండ్స్ కు నివాళి.
– రత్నకిశోర్ శంభుమహంతి