ఎడిట్ నోట్: రిజర్వేషన్ రాజకీయం.!

-

తెలంగాణలో బీజేపీ ఆట మొదలుపెట్టింది..వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌ని గద్దె దించే క్రమంలో కేంద్రం పెద్దలు..తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా బి‌జే‌పి రాజకీయం చేస్తుంది. ఇటు బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ…కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా రాజకీయంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయినా సరే ఇంకా వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. ఇక బండికి కేంద్రం పెద్దలు సపోర్ట్ కూడా ఉండటంతో ఇంకా దూకుడుగా వెళుతున్నారు.

ఇంకా తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం పెద్దలు వరుస పెట్టి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడ రాజకీయంగా కే‌సి‌ఆర్ కు చెక్ పెట్టేందుకు అదిరిపోయే వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వచ్చారు. చేవెళ్ళలో భారీ సభ ఏర్పాటు చేశారు. సభకు బి‌జే‌పి శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇదే క్రమంలో షా..ఎన్నికల శంఖారావం పూరించారు. ఆద్యంతం కే‌సి‌ఆర్‌ని టార్గెట్ చేసి షా విరుచుకుపడ్డారు. టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో కాస్త హడావిడి చేస్తున్న కే‌సి‌ఆర్..పి‌ఎం పదవిపై కన్నేసిన విషయం తెలిసిందే.

దీనిపై అమిత్ షా..కే‌సి‌ఆర్ కు కౌంటర్ ఇచ్చారు.  నెక్స్ట్ సి‌ఎం పదవి పోతుందని, ఇంకా పి‌ఎం పదవి దక్కడం కల అని, ఆ పదవి మోదీ కోసం రిజర్వ్ చేసి ఉందని అమిత్ షా అన్నారు. ఇక తెలంగాణలో కూడా బి‌జే‌పి అధికారంలోకి రాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే షా..ఊహించని విధంగా రిజర్వేషన్ రాజకీయం మొదలుపెట్టారు. ఇప్పటివరకు తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు అవుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో కే‌సి‌ఆర్ రాజకీయంగా లబ్ది పొందుతున్నారు. కానీ ముస్లిం ఓట్లు పెద్దగా బి‌జే‌పికి పడవు. దీంతో షా..తెలంగాణలో బి‌జే‌పి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కేలా చేస్తామని అన్నారు. అంటే ఎలాగో ముస్లిం ఓట్లు పడవు..దీంతో ఎస్సీ, బీసీలని ఆకట్టుకోవడం కోసం..ఆ రిజర్వేషన్లని రద్దు చేస్తామని అన్నారు. మరి ఈ అంశం రాజకీయంగా బి‌జే‌పిపై ముస్లింలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ ఎస్సీ, బీసీల్లో లబ్ది జరుగుతుందని అమిత్ షా స్కెచ్ వేశారు. అయితే ఈ అంశం బి‌జే‌పికి రాజకీయంగా ఎంత లాభం చేకూరుస్తుందో..కే‌సి‌ఆర్ కు ఎంత నష్టం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news