తెలంగాణ కొత్త సచివాలయం..అంగరంగ వైభవంగా కట్టారు. ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయేలా..కేసిఆర్..సచివాలయం నిర్మించుకున్నారు. ఇది మంచి విషయమే..తెలంగాణ గర్వపడేలా సచివాలయం ఉంది. కానీ ఆ సచివాలయం తెలంగాణలోని సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందా? పేద ప్రజలకు సచివాలయంలో ఎంట్రీ ఉంటుందా? అంటే ఆ ప్రశ్నలకు ఠక్కుమని సమాధానం చెప్పాలని పరిస్తితి..ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న సచివాలయంకు కేసిఆర్ వచ్చిన పరిస్తితి లేదు..అలాగే అక్కడ సామాన్యులకు ఎంట్రీ కనబడలేదు.
పాత సచివాలయంలో ఇప్పటివరకు జరిగిన సీన్ అదే. అయితే వాస్తు దోషం పేరిట పాత సచివాలయాన్ని కూల్చివేసి.. రూ.1200 కోట్లు ఖర్చుపెట్టి కొత్త సచివాలయాన్ని నిర్మించారు. ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్న కొత్త సచివాలయాన్ని తాజాగా అట్టహాసంగా ప్రారంభించారు. అయితే పాత సచివాలయం బాగానే ఉందని దాన్ని కూల్చవద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారీగా ఖర్చు చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని విమర్శించాయి. సచివాలయ భవన నిర్మాణ నిధులతో రాష్ట్రంలో నూతనంగా ఆస్పత్రులను నిర్మించాలని ప్రతిపక్షాలు సూచించాయి. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త సచివాలయం నిర్మించింది.
ఇప్పుడు ఆ సచివాలయంకు కేసిఆర్ రెగ్యులర్ గా వస్తారా? అలాగే అక్కడకి సామాన్య ప్రజలని రానిస్తారా? వారి సమస్యలని పరిష్కరిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక ప్రగతి అంతా ప్రగతిభవన్‌కి, ఎర్రవల్లి ఫాంహౌస్‌కి మాత్రమే పరిమితమై ప్రజలు అధోగతి పాలయ్యారు. మంత్రులు సైతం ఆయన బాటలోనే నడిచి ప్రజలకు దూరమయ్యారు. గత తొమ్మిదేళ్లుగా అటు ప్రగతి భవన్‌లో గాని, నాటి సచివాలయంలో గాని ప్రజలకు ముఖం చూపించని కేసీఆర్ ఇప్పుడు కట్టించిన ఈ కొత్త సచివాలయంలోనైనా ప్రజలకు అందుబాటులోకి వస్తారా… ప్రజల్ని లోపలికి రానిస్తారా? అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఎన్నికల సమయం కావడంతోనే కేసిఆర్ సచివాలయం పేరిట హడావిడి చేస్తున్నారు..ఎన్నికల సమయం వరకు కేసిఆర్ సచివాలయంకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ కొత్త సచివాలయం సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో లేదో.