హుజూరాబాద్ గడ్డపై బిజేపి జెండా ఎగరడం ఖాయం : ఈటెల

టీఆర్ఎస్ పై మరోసారి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ గడ్డ పై బిజెపి జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. జెండాకి ఇక వ్యక్తి ఓనర్ ఉండడు అని చెప్తామని.. ఏ పార్టీలో అయినా కార్యకర్త కూడా జెండాకి ఓనర్లేనని చెప్పాల్సిందే అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని హుజరాబాద్ లో నేను కూడా అని చెప్పానని స్పష్టం చేశారు ఈటల. హుజురాబాద్ ప్రజలు నన్ను ఆరుసార్లు గెలిపించారని… మరోసారి కూడా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మా హక్కులకు భంగం కలిగితే దేనికైనా రెడీగా ఉంటామని హెచ్చరించారు. అధికారం నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చురకలు అంటించారు ఈటల. కాగా ఈ నెల 14 న ఈటల రాజేందర్ బిజేపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈటల తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా ఇంకా తదితరులు బిజేపి కండువా కప్పుకున్నారు.