కరోనా కోసం గాంధీ తరహాలోనే వరంగల్ ఎంజీఎం !

-

ఈరోజు తెలంగాణా ఆరోగ్య, మునిసిపల్ శాఖా మంత్రులు ఈటెల రాజేంద్ర, కేటీఆర్ లు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వరంగల్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని కూడా వారు తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ లోని గాంధీ తరహాలోనే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ని కూడా తీర్చిదిద్దన్నట్లు ఈటెల రాజేంద్ర తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజిఎంను సందర్భించిన అనంతరం వైద్యాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. వరంగల్ ఎంజిఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామని ఈటల పేర్కొన్నారు. ఎంజీఎంలోనే అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. అంతే కాక వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మోబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్లు కూడా ఈటెల ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news