రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. గజ్వేల్ లో ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తానని.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
బీజేపీకి భయపడే అభ్యర్థుల లిస్ట్‌ను కేసీఆర్ ముందే ప్రకటించారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రటించిన లిస్ట్‌లో ఉన్న సగం మంది ఓడిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నాడన్నారు ఈటల. ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంటే ముందే క్యాండిడేట్ల లిస్ట్‌ను ప్రకటించిం.. సీఎం కేసీఆర్ ఎన్నికల కసరత్తును స్పీడప్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో.. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ఎప్పడు ప్రకటిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.