Breaking : హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఒకే విడతలో పోలింగ్‌

-

హిమాచ‌ల్ ప్రదేశ్ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌నర్ రాజీవ్ కుమార్‌, ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అనూప్ చంద్ర పాండేతో క‌లిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్రకారం ఒకే విడ‌త‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి.

gujarat election date 2022 himachal pradesh election schedule all updates -  India Hindi News - क्यों गुजरात से पहले हिमाचल को मिलेगा वोटिंग का मौका,  पहले भी होता रहा है ऐसा

రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండ‌గా… వాటికి న‌వంబ‌ర్ 12న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపును డిసెంబ‌ర్ 8న చేప‌ట్టి అదే రోజు ఫ‌లితాల‌ను వెల్లడించనున్నట్లు పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 17న నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుండ‌గా…అదే రోజు నుంచి నామినేష‌న్ల దాఖ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 25తో నామినేష‌న్ల‌కు గ‌డువు ముగియ‌నుండ‌గా… 29 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉందని షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news