ఏంటీ.. ఈ ఉంగరం ఉంటే దోమలు కుట్టవా?

-

ఒకప్పుడు వర్షాకాలం వస్తే దోమలు,ఈగలు ఎక్కువ అయ్యేవి..దాంతో సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చేవి..కానీ ఇప్పుడు మాత్రం ఏ కాలం అయిన వాటి బెడద ఎక్కువగా ఉంటుంది.నిల్వ ఉన్న నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ దొమల బెడద కారణంగా రాత్రి సమయంలో సరిగా నిద్ర కూడా పట్టదు. ఇది ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న సమస్య అనే చెప్పాలి..చాలామంది ఈ విషయంలో విసుగు చెందుతూ ఉంటారు.

 

 

 

 

అయితే అటువంటి వారికి ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే దోమలు కుట్టకుండా ఉండటం కోసం ఒక రింగ్ వచ్చేసింది. ఆ రింగును పెట్టుకుంటే దోమలు దరిదాపుల్లోకి కూడా రావట.జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ హలే విటెన్ బర్గ్ కు చెందిన పరిశోధకులు త్రీడీ సాంకేతికతతో ఒక ఉంగరాన్ని తయారు చేశారు. దోమలు అలాగే ఇతర కీటకాలు ఎక్కువ కాలం దూరంగా ఉంచడానికి శాస్త్రవేత్తలు కొత్త 3డి ప్రింటింగ్ వేరబుల్ రింగును అభివృద్ధి చేశారు. ఒక సాధారణ క్రిమి వికర్షకం ఏఆర్ 3535 ని ఉపయోగించి నమూనాను అభివృద్ధి చేశారు. ఏఆర్ 3535 కలిగిన దోమల స్ప్రే చర్మంపై చాలా సున్నితంగా ఉంటుందట.

ఎటువంటి హానీ కలిగించకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు… చాలా సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నామని వాడు తెలిపారు. కాగా ఈ సాధారణంగా స్ప్రే లేదంటే లోషన్ రూపంలో ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని గంటలపాటు రక్షణను అందిస్తుంది అని వాళ్ళు తెలిపారు. ఇది పని చేస్తుంది.. కొంత వరకూ దొమలను అరికడుతుంది..దాంతో దీనికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది.. ఇలాంటిది మన దేశంలో అయితే లేదని చెబుతున్నారు. త్వరలో మన దేశంలోకి కూడా రావచ్చునని సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news