ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు రంగం సిద్దం చేసిన ఏపీఎస్ఆర్టీసి..!

-

ఎల‌క్ట్రిక్ బస్సులను నడపడానికి ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. పర్యావరణ కాలుష్యం తగ్గించి తద్వారా ప్రజలకు మేలైన రవాణా సౌకర్యం కల్పించడానికి బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తోంది. 100 విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడానికి ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి లలో 350 విద్యుత్ బస్సులను న‌డ‌పాల‌ని ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) అద్దె ప్రాతిపదికన బ‌స్సుల‌ను త్రిప్పడానికి ఏపీఎస్ ఆర్టీసీ టెండర్లను సైతం పిలిచింది.

electric busses in andhrapradesh

టెండర్ల ప్రక్రియ లో మొత్తం ముగ్గురు పాల్గొన్నారు. మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ హైద్రాబాదు మరియు మెస్సర్స్ అశోక్ లేలాండ్, చెన్నై సంస్థ‌లు పాల్గొన్నాయి. కాగా మెస్పర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంద్ర డీజిల్ బస్సు రేటుతో ఎలక్ట్రిక్ బస్సులు త్రిప్పుటకు ఒప్పుకుంది. మెన్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి నుండి నిర్దేశించిన మార్గాలలో బ‌స్సుల‌ను నడుపనుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సులను సీఎం త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version