భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి ?

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  ఎదురు కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు  మృతి చెందినట్లు సమాచారం. అయితే కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసుల సమాచారం.

గ‌డ్చిరోలి జిల్లాలోని కోబ్రామెడ అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు, మావోయిస్టులు ప‌ర‌స్ప‌రం ఎదురుప‌డ‌టంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన త‌ర్వాత పోలీసులు అక్కడికి వెళ్లి ప‌రిశీలించ‌గా ఐదు మృత‌దేహాలు ల‌భ్య‌మైన‌ట్లు తెలిసింది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.