జులై 1 నుంచి ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధం అమలు

-

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ స్ట్రాలను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. దీంతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలు కనుమరుగవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ స్థాయిలో వినియోగించే స్ట్రాలు కూడా కనుమరుగు అవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటికి ప్రత్యామ్నాయంగా పేపర్ స్ట్రాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్ట్రాల నిషేధాన్ని ఎత్తివేయాలని ‘అమూల్’ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్

దేశంలో భారీ స్థాయిలో ప్లాస్టిక్ స్ట్రాల వినియోగం జరుగుతుంది. ప్రముఖ కూల్‌డ్రింక్, పాల ఉత్పత్తి సంస్థలైన పెప్సీ, కోకాకోలా, అమూల్ సంస్థలు ప్రతిఏటా కొన్ని వందలకోట్ల ప్లాస్టిక్ స్ట్రాలను వినియోగిస్తున్నాయి. పాల ప్యాకెట్లు, పండ్ల రసాలు పాకెట్లకు స్ట్రాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ నేపథ్యంలో నిషేధాన్ని ఎత్తివేయాలని అమూల్‌తోపాటు, పార్లే సంస్థలు కూడా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. పేపర్ స్ట్రాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలని, ఒకవేళ చైనా నుంచి దిగుమతి చేసుకుంటే వాటిపై 250 శాతం ఖరీదు చేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై అదనపు భారం పడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news