విద్యార్థులకు అలర్ట్.. ఈ రోజు నుంచి ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) పరీక్షలు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. ఈ రోజు నుండి ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) పరీక్షలు జరుగనున్నాయి. రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) కి 1,72,241 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ఈ మేరకు తెలంగాణ లో 89, ఆంధ్ర ప్రదేశ్ లో 19 సెంటర్ లు ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో సెషన్ లో 29 వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఒక సెషన్‌ జరుగనుండగా… మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు రెండో సెషన్‌ ఉండనుంది. కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news