పాడి కౌశిక్ రెడ్డి కాస్త.. పాలేరు కౌశిక్ రెడ్డి అయ్యాడని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయం లో మానుకోట ఉద్యకారుల పైన రాళ్ళు విసిరిన ఉద్యమ ద్రోహి పాడి కౌశిక్ రెడ్డి అని.. ఒక ఉద్యమ ద్రోహితో ఉద్యమకారుడికి చర్చనా.!? అని నిప్పులు చెరిగారు. ఈటెల పుణ్యమా అని దొడ్డి దారిలో ఎమ్మెల్సీ పదవి పొందావని.. పాడి కౌశిక్ రెడ్డి వి పిల్లబచ్చా ఏశాలు అంటూ చురకలు అంటించారు.
ఈటెల దెబ్బ తో కెసిఆర్ కుటుంబానికి చలిజ్వరం వచ్చినట్టుందని.. డైవర్ట్ పాలిటిక్స్ తో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. బోనులో సింహాన్ని బంధించి తొడగొట్టినట్టు మా కార్యకర్తలను అరెస్ట్ చేసి సవాల్ లు విసురుతున్నారని.. హుజూరాబాద్ ప్రజలు ఈటెల కు జై కొట్టి ఏడాది కూడా అవ్వట్లే మళ్ళా అప్పుడే సవాల్ అంటే జనాలు నవ్వుకుంటున్నారన్నారు.
తాటి చెట్టు పెరిగినట్టు పెరిగినవ్ గాని ఈత గింజంతా ఇగురమ్,ఇంగిత జ్ఞానం కూడా లేదని ఆగ్రహించారు ఏనుగుల రాకేష్ రెడ్డి.