కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా తో కోమటిరెడ్డి వేంకటరెడ్డి ఈ రోజు భేటీ కానున్నారు. తెలంగాణ వరదల నష్టంపై చర్చించేందుకు అమిత్ షా తో కోమటిరెడ్డి వేంకటరెడ్డి సమావేశం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వీరి సమావేశం జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమావేశం అయిన అనంతరం స్పష్టమైన నిర్ణయం తీసుకోనేందుకు సమాయత్తమౌతున్నారు కోమటిరెడ్డి వేంకటరెడ్డి.
కాగా.. నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కి జరిగే ఎన్నికలతో పాటు, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లేదా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలాఖరు లోనే మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో “ఆంతరాత్మ ప్రబోధం” మేరకు ఓటెయ్యాలని తన మద్దతుదారులకు, శ్రేయోభిలాషులకు, అనుచరులకు పిలుపు నివ్వాలనే ఆలోచన లో కోమటిరెడ్డి వేంకటరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.