ఈటల సంచలన ప్రకటన..ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా !

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కెసిఆర్ ఆర్ కే లేదా ఆయన అల్లుడు మంత్రి హరీష్ రావు ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదామని…. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల రాజేందర్ ప్రకటించారు.

ఒకవేళ మీరు ఓడిపోతే సీఎం పదవి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. టిఆర్ఎస్ పార్టీ ఆరిపోయింది దీపం అని… ఆరిపోయే దీపం ముందు ఎక్కువ వెలుతురు ఇస్తుందని ఎద్దేవా చేశారు. తాను ఉన్నంతకాలం ప్రజల కోసం కొట్లాట తానని… పదవుల కోసం కాదని ఈటెల స్పష్టం చేశారు. ఉద్యకారుల ఉసురు టీఆర్‌ఎస్‌ పార్టీకి కొడుతుందని… టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయని తెలిపారు. ఈటెల రాజేందర్ దద్దమ్మ కాదని..పని చేతకానివాడు కాదని.. అయి ఉంటే ఇంత అభివృద్ధి జరిగేది కాదని చురకలు అంటించారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news