ఈటల ఎఫెక్ట్: కిషన్ రెడ్డి లైన్‌లోకి వచ్చారు?

-

తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ముందుకెళుతుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గట్టిగానే పోరాడుతుంది. అలాగే హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు తర్వాత మరింతగా టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇక బీజేపీ దూకుడు చూసి టీఆర్ఎస్ కూడా అలెర్ట్ అయింది. ఆఖరికి సీఎం కేసీఆర్ సైతం ఎంట్రీ ఇచ్చి…బీజేపీపై ఫైర్ అవుతున్నారు.

etela
etela

ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ నేపథ్యంలో బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. బీజేపీలో నాయకుల మధ్య పోటీ కూడా కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది. అంటే బీజేపీలో సీఎం రేసు మొదలైనట్లే తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్ధి ఎవరు అనేది ఇప్పటినుంచే క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అంటే బీజేపీలో కొందరు బడా నేతలు సీఎం రేసులోకి వచ్చారు.

అయితే ఇప్పటివరకు బీజేపీలో లీడ్ ఎవరిది అనేది క్లారిటీ లేదనే చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నా సరే…ఆయన కూడా సీఎం రేసులోక ఉన్నారు. మామూలుగా బండి వచ్చాకే తెలంగాణ బీజేపీలో మార్పులు వచ్చాయని చెప్పొచ్చు.  బండి సారథ్యంలోనే బీజేపీ బలపడుతుంది…మంచి విజయాలు అందుకుంటుంది. పైగా కేసీఆర్ సైతం బండినే టార్గెట్ చేయడంతో….ఆయనే బీజేపీలో టాప్‌లో ఉన్నారని హింట్ ఇచ్చినట్లు అయింది.

అదే సమయంలో హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచి ఈటల రాజేందర్ ఒక్కసారిగా సీఎం రేసులోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న ఈటలకే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఒక్కసారిగా దూకుడు మొదలుపెట్టారు. మామూలుగా కాస్త సాఫ్ట్‌గా రాజకీయాలు చేసే కిషన్ రెడ్డి..ఈ మధ్య టీఆర్ఎస్‌పై ఫైర్ అవుతున్నారు…ఇక తాను కూడా సీఎం రేసులో ఉన్నానని కిషన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నట్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news