భూ దందాకు రూపకర్త. సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆరేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. భూప్రక్షాళన పేరుతో కోట్లు విలువ చేసే వేల ఎకరాలు దోచేస్తున్నారని ఆరోపించారు. ధరణిలో నమోదైన భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూ సమస్యల వల్ల అనేకమంది రైతులు న్యాయస్థానం మెట్లు ఎక్కుతుంటే.. ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
”భూ దందాకు రూపకర్త, సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆరే. భూప్రక్షాళన పేరిట ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారు. ధరణి భూముల రిజిస్ట్రేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భూక్రయ,విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలను వేధించే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? దేశంలో భూములన్నీ ఎన్‌ఐసీలో భద్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 4సంస్థలు మార్చారు. భూ సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ధరణి విఫలమైందని ఒప్పుకుని సీఎం పదవికి రాజీనామా చేయాలి.” – ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే