కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలు : ఈటల రాజేందర్

-

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థికంగా మొదటి స్థానంలో మన రాష్ట్రం మెరుగు పడుతుందని చెప్పిన కేసీఆర్ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈటల పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వొద్దని రైతులు అంటున్నారని ఈటల చెప్పారు. ఎకరానికి 15 వేలు ఒకేసారి ఇస్తారా? ఎలా ఇస్తారు? దానికి క్లారిటీ లేదు.. మొదటి పంటకి ఇస్తారా? రెండో పంటకి ఇస్తారా? అని ప్రశ్నించారు ఈటల.

ఇప్పుడు రాష్ట్రంలో తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకుని సోకులు చేస్తున్నట్లుంది కేసీఆర్ పరిస్థితి అని.. లిక్కర్ ద్వారా వస్తేనే ఆదాయం.. లేకుంటే ఆస్తులు అమ్మే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఈటల అన్నారు. పెన్షన్లు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. డబల్ బెడ్ రూంలు లేవు..తాను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాలుగు సార్లు మేనిఫెస్టో రాసినా అది అమలు కాలేదన్న ఈటల… రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అయినా లక్ష రూపాయల రుణ మాఫి చేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news