ఇళ్లు బాగున్నా..బెడ్‌ రూమ్‌లో ఇవి ఉంటే..ఆ జంట మధ్య ఎప్పుడూ కీచులాటే..!

-

వాస్తు అంటే.. కేవలం.. ఇళ్లు, కాంపోండ్‌ వాల్స్‌ మాత్రమే కాదు.. ఇంట్లో ఉండే గదులు, ఆ గదిలో పెట్టే వస్తువులు కూడా.. చాలామంది.. కిచెన్‌ ఉండాల్సిన దిక్కులో ఉందా.., ఈశాన్యం ఎక్కువ వచ్చిందా, నైరుతీ బాగుందా ఇవి మాత్రమే చూసుకుంటారు. ఇవి కరెక్టుగా ఉన్నా..బెడ్‌రూమ్‌లో దోషాలు ఉంటే.. ఆ జంట ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఎప్పుడు భార్యభర్తల మధ్య ఏదో ఒక గొడవ జరుగుతుంది. త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, ఒక‌రి మీద ఒక‌రు అరుచుకోవ‌డం, మ‌న‌శాంతి లేక‌పోవ‌డం, అకార‌ణ చికాకులు, అనారోగ్యాల‌కు గురి కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య శృంగార‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డం ఇవి జరుగుతున్నాయంటే.. మీ బెడ్‌రూమ్‌లో దోషం ఉన్నట్లే..

ముఖ్యంగా వాస్తు నిపుణులు చెప్పేది ఏమిటంటే బెడ్ రూమ్ యొక్క వాస్తు బాగున్న‌ప్ప‌టికి ఆ గ‌దిలో ఉంచే వ‌స్తువుల వ‌ల్ల దాంప‌త్య స‌మ‌స్య‌లు ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌ట‌. వాటిలో ముఖ్యంగా చెప్పేది వాట‌ర్ పెయింటింగ్స్. వాట‌ర్ పెయింటింగ్స్ ఉన్న బెడ్ రూమ్‌లో భార్యాభ‌ర్తలు శృంగారంలో ఆస‌క్తి చూపించ‌ర‌ట‌. క‌నుక వాట‌ర్ పెయింటింగ్స్‌ను వెంట‌నే ఇంట్లో నుంచి తీసివేయాలి.

భార్యాభ‌ర్త‌ల జీవితం సాఫీగా సాగాలంటే హార్ట్ షేప్ వ‌స్తువుల‌ను నైరుతి దిశ‌లో ఉంచుకోవాల‌ట‌. దీని వ‌ల్ల వారి జీవితం హాయిగా ఉంటుంది. అలాగే ఇద్ద‌రికి ఒక‌రి మీద ఒక‌రికి ఆస‌క్తి ఉండాలంటే ఒక అంద‌మైన గిన్నెలో ఫ్యూర్ క్రిస్ట‌ల్స్‌ను బియ్యం వేసి పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పెరుగుతుంది. క్రిస్ట‌ల్ ల్యాంప్స్, రెడ్ క‌ల‌ర్ బ‌ల్బుల‌ను బెడ్ రూమ్‌లో నైరుతి వైపు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది.

రెడ్ క‌ల‌ర్ ప‌ర‌దాలు, కుష‌న్స్ ఉప‌యోగిస్తే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పెరుగుతుందట.. రెడ్ క‌ల‌ర్ మ‌రీ నిండుగా ఉంటుంద‌ని భావిస్తే పింక్ క‌ల‌ర్ ను ఉప‌యోగించిన ఇద్ద‌రి మ‌ధ్య బాంధ‌వ్యం చాలా అన్యోన్యంగా ఉంటుంది.

సెరామిక్ బౌల్స్‌ను నైరుతి దిశ‌గా బెడ్ రూమ్‌లో ఉంచుకోవాలి. ఇలా పెట్టుకోవ‌డం వ‌ల్ల వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ గిన్నెలో చిన్న స్టోన్స్ లేదా క్రిస్ట‌ల్స్‌ను పెట్టుకోవ‌చ్చు. అలాగే రెడ్ క‌ల‌ర్ క్యాండిల్స్‌ను పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

ఎల్ల‌ప్పుడూ బెడ్ రూమ్‌ను శుభ్రంగా, అందంగా ఉంచుకోవాలి. బెడ్ ప‌క్క‌న ఉండే టేబుల్ మీద అన్నీ వ‌స్తువుల‌ను చింద‌రవంద‌ర‌గా పెట్టొద్దు. అలాగే దుమ్ము ప‌ట్టి ఉండ‌కూడదు.

Read more RELATED
Recommended to you

Latest news