ఒక పంటకు కావలసిన పోషకాలు నెలలో ఉంటాయి.. మిగిలిన పోషకాలు మనం వేసే ఎరువుల నుంచి వస్తాయి.అందుకే ఎరువుల విషయం లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.పోషకాలలో భారత నేల చాలా తక్కువగా ఉందని పేర్కొంది. సాంపిల్స్‌లో దాదాపు 85 శాతం మట్టిలో ఆర్గానిక్ కార్బన్ లోపం ఉంది. వీటిలో దాదాపు 15 శాతం శాంపిల్స్‌లో ఆర్గానిక్ కార్బన్ తక్కువ స్థాయిలో ఉంది..అందుకే పశువుల ఎరువును వాడితే మంచి ఫలితాలను అందుకోవచ్చని అంటున్నారు. పశువుల ఎరువు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..
*.ఇంటి దగ్గర గాని, పశువుల కొట్టాల వద్ద గాని, సాధ్యమైనంత వరకు చెట్ల నీడ గల ప్రాంతాన్ని పశువుల ఎరువు నిల్వ చేయుటకు ఎన్నుకోవాలి.
*. పశువుల మల మూత్రాదులు, పశువులు తినగా మిగిలిపోయిన గడ్డి, వ్యవసాయం నుండి వచ్చే వ్యర్ధ పదార్థాలు, చెత్త చెదారాలు, ఆహార పదార్ధాలలో మిగిలిన వ్యర్ధాలు రోజూ కుప్పగా వేస్తారు.
*. ఈ కుప్పగా వేసిన పదార్థాలు సూక్ష్మ జీవుల వలన చివికి – క్రుళ్ళి తొలకరి (జూన్ – జూలై) సమయానికి ఎరువుగా తయారవుతుంది.
*. ఈ ఎరువును హెక్టేరు కు 10 టన్నులు పైగా వేసుకోవచ్చు..
పశువుల ఎరువుల నాణ్యత:
పశువుల మల మూత్రాదులలో పోషక పదార్ధాలు వట్టిపోయిన లేదా వయస్సు ముదిరిన పశువుల కంటే తక్కువ గా వుంటాయి.
వరి గడ్డి, జొన్న, మొక్కజొన్న మొదలైన గడ్డి తినే పశువుల కంటే పప్పు జాతి పశు గ్రాసాలు మరియు నూనె గింజల నుండి తయారయ్యే చెక్క / పిండి తోనే పశువుల వ్యర్ధాలు అధిక పోషకాలు కలిగి ఉంటాయి.
పశువుల పేడ, మూత్రం నేలలో ఇంకకుండా పెంట పోగుకు చేర్చిన ఎరువు పోషక విలువ పెరుగుతుంది.
గోబర్ గ్యాస్ తయారీకి వాడిన – ఎరువు పోషక విలువలు పెరగడమే గాక, మన నిత్యావసరాలకు గ్యాసు వినియోగించు కోవచ్చు.
ఎండకు ఎండి, వానకు తడిసిన ఎరువు కంటే పైన నీడను కల్పించి ప్లాస్టరింగ్ చేసిన గోతులలో నిల్వ చేసిన ఎరువు ఎక్కువ పోషక విలువలు కలిగి వుంటుంది.