అన్నం తింటే రోగాలు తప్పవా..ఇందులో నిజమెంత..?

-

మనము తీసుకునే ఆహారంలో ఎక్కువగా అన్నం ఉంటుంది. ప్రత్యేకంగా దక్షిణ భారతీయులలో మూడు పూటలా అన్నం తినడానికి ఇష్టపడే వారుంటారు.ఉత్తర భారతీయులు ఎక్కువగా రొటీలు తింటారు. ఏ ప్రాంత వాతావరణం బట్టి, ఆచారావ్యహారాలను బట్టి వారి ఆహార అలవాట్లు వుంటాయి. కానీ కొంతమంది కి అన్నం తింటే లావువుతారని లేదా పొట్ట బయటకు వస్తుందని అపోహ ఉంటుంది .పెద్దలు అన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు . వాస్తవానికి చిన్నతనంలో పిల్లలకి బియ్యం పిండి ఇవ్వాలని సలహా ఇస్తారు.

అన్నం ఆరోగ్యకరం అని చెప్పడంలో తప్పులేదు, కానీ తినవలసిన సమయంలో , తినవలసిన పరిమాణంలో తినాలి. అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలు స్థూలకాయం, అధిక రక్త చక్కెర, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. రాత్రిపూట అన్నం తినాలా వద్దా..? అన్నం తినడంపై తరచుగా అనేక సందేహాలు తలెత్తుతాయి. కానీ రాత్రి పూట అన్నం తినకూడదని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి. రాత్రిపూట అన్నం తినడం వల్ల ఇందులో వుండే కార్బోహైడ్రెట్స్ తొందరగా అరగక షుగర్స్ గా స్టోర్ చేసుకుంటుంది. ఆహారం తగిన విధంగా తీసుకోకపోతే స్తూలకాయ సమస్యలు, మలబద్ధకం,మధుమేహ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆహారం శరీరానికి ఉపయోగపడాలంటే నిర్ణీత సమయం ఉండాలి. సరైన మోతాదులో లేదా ఏదైనా ఆహారాన్ని తినే సమయానికి శ్రద్ధ వహించకపోతే, ఆరోగ్యానికి ప్రయోజనం కాకుండా హానిని ఎదుర్కోవలసి ఉంటుంది. బరువును తగ్గించుకునే పనిలో ఉన్నట్లయితే, అన్నం తినకుండా బ్రౌన్ రైస్ మాత్రమే తినండి. తద్వారా పిండి పదార్ధాలకు బదులుగా ఫైబర్ లభిస్తుంది. దీనితో మొత్తం ఆహారంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ పొందవచ్చు.

అన్నం తినడానికి ఎల్లప్పుడూ మధ్యాహ్నం పూట ఎంచుకోండి. రెడ్ రైస్ తో కానీ బ్రౌన్ రైస్ తో కానీ వండే అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మనకు బలాన్ని చేకూరుస్తాయి. దంపుడు బియ్యంతో చేసే అన్నం చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఈ అన్నం అధిక పొట్ట తగ్గెందుకు చాలా మేలు చేస్తుంది. ఉడకబెట్టిన అన్నం సులభంగా జీర్ణమవుతుంది.అన్నం తినేటప్పుడు కూరలు ఎక్కువగా తీసుకొని రైస్ పరిమాణం తగ్గిస్తే అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news