Fact check: రూ.4,500 చెల్లిస్తే పీఎం ముద్ర యోజనతో పది లక్షలు…నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

సోషల్ మీడియాలో తరచూ స్కీములకి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పీఎం ముద్ర యోజన కింద 10 లక్షల లోన్ పొందవచ్చని కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు వెరిఫికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాలని అందులో ఉంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశం ఇస్తోంద..? ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

పైగా లోన్ అప్రూవల్ లెటర్ ని కూడా అందిస్తున్నారు. పది లక్షల లోన్ రావడం లోన్ లెటర్ ఇవన్నీ కూడా నకిలీవే. పీఎం ముద్ర యోజన కింద కేంద్రం పది లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. ఇది నకిలీ వార్త కనుక వెరిఫికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 4500 చెల్లించద్దు. ఇటువంటి ఫేక్ వార్తలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా మీరే నష్టపోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news